KTR: దిల్లీ నుంచే తెలంగాణ పరిపాలన: కేటీఆర్‌

సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ వెళ్లి ప్రపంచ వేదికపై అసత్యాలు చెప్పారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.

Updated : 25 Jan 2024 16:51 IST

హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధం చెప్పారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ఇలా అబద్ధాలు చెప్పినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో కేటీఆర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

‘‘సీఎం దావోస్‌ వెళ్లి ప్రపంచ వేదికపై అసత్యాలు చెప్పారు. రైతు భరోసా గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. రేవంత్‌ రెడ్డి 45 రోజుల్లో సాధించింది దిల్లీ పర్యటనలు మాత్రమే. తెలంగాణ పరిపాలన దిల్లీ నుంచి జరుగుతోంది. సీఎం కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. అదానీ సంస్థలతో ఇప్పుడు ఎలా ఒప్పందాలు చేసుకున్నారు? కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు వెంటాడుతాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని