KTR: ఆ నెటిజన్‌ పరిశీలనతో నేనూ ఏకీభవిస్తున్నా: కేటీఆర్‌

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు.

Updated : 31 Dec 2023 13:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  ‘‘కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటం సులభమయ్యేది’’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారని పేర్కొన్నారు. ఈ పరిశీలనతో తానూ ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని