KTR: అది ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ అయితే బాగుండేది: కేటీఆర్‌ ట్వీట్‌

ఎల్పీజీ సిలిండర్‌ ధర పెరుగుదల ఏప్రిల్‌ ఫూల్‌ తరహా జోక్‌ అయితే బాగుండేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Updated : 01 Apr 2022 12:36 IST

హైదరాబాద్‌: ఎల్పీజీ సిలిండర్‌ ధర పెరుగుదల ఏప్రిల్‌ ఫూల్‌ తరహా జోక్‌ అయితే బాగుండేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250కి పైగా పెరిగిందనే ఓ వార్తా కథనంపై ట్విటర్‌లో ఆయన చమత్కారంగా స్పందించారు. ఇది ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ కావాలని సీరియస్‌గా తాను భావిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో ‘అచ్చే దిన్ దివస్’ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోలుస్తూ వ్యంగ్యంగా స్పందించారు. అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తూ తాను పోస్టింగ్స్ పెట్టిన ప్రతిసారీ ఇబ్బంది పడే వారు ట్విటర్‌లో తనను అనుసరించవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, భాజపా మతతత్వ విధానాలు, దుష్ప్రచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని