HD Kumaraswamy: భాజపా, జేడీఎస్ పొత్తు ఖరారు కాలేదా..?కుమారస్వామి ఏమన్నారంటే..!

భాజపా-జేడీఎస్(BJP-JDS) పొత్తుపై ఇరు పార్టీల నాయకులు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న యడ్డీ పొత్తుకు అనుకూలంగా మాట్లాడగా.. కుమారస్వామి(HD Kumaraswamy) అందుకు విరుద్ధంగా స్పందించారు.

Updated : 09 Sep 2023 16:17 IST

బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో భాజపా(BJP), జేడీఎస్‌(JDS) కలిసి పోటీ చేయాలని తీర్మానించాయని భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం బి.ఎస్‌.యడియూరప్ప(Yediyurappa) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(HD Kumaraswamy) భిన్నంగా స్పందించారు. సీట్ల పంపకాలపై ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు. 

‘యడియూరప్ప(Yediyurappa) చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతం. సీట్ల పంపకాలు, ఇతర విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు. మేం ఇప్పటివరకు రెండుమూడు సార్లు సమావేశమయ్యాం. అవి ఆత్మీయ భేటీలు. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్నికల కోసం చర్చలు జరిపే అవకాశం ఉంది. అదంతా ప్రజల కోసమే. వారికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. 2006లో నేను భాజపాతో కలిసిపనిచేశాను. ఆ సమయంలో నేను 20 నెలల పాటు అందించిన పాలనతో నాపై సదాభిప్రాయం ఏర్పడింది’ అని కుమారస్వామి మీడియాతో వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు అరెస్టు.. అర్ధరాత్రి నుంచి ఎప్పుడేం జరిగిందంటే?

ఇదిలా ఉంటే.. దిల్లీలో మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ, భాజపా అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షాతో చర్చల సందర్భంగా పొత్తు కుదిరినట్లు యడ్డీ శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిని జేడీఎస్‌కు విడిచిపెట్టాలని భాజపా నిర్ణయించినట్లు తెలిపారు. హాసన, బెంగళూరు గ్రామీణం, కోలారు, తుమకూరు నియోజకవర్గాల్లో జేడీఎస్‌ పోటీ చేయనుండగా, భాజపా మద్దతివ్వనుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న జేడీఎస్‌ 7 స్థానాల్లో పోటీ చేసి, ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. యడ్డీ చెప్పిన ప్రకారం.. జేడీఎస్‌కు కేటాయించిన లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గడం కుమారస్వామి నుంచి భిన్నమైన స్పందన రావడానికి కారణం కావొచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు