Nara Lokesh: తెదేపాలో చేరిన ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి

శృంగవరపుకోటకు చెందిన వైకాపా నేతలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. 

Published : 04 Mar 2024 21:25 IST

ఉండవల్లి: శృంగవరపుకోటకు చెందిన వైకాపా నేతలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భార్య సుధారాణి సహా 150 మంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. విధ్వంస పాలనతో ప్రజల ఆశలకు సీఎం జగన్ గండికొట్టారని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామని స్పష్టం చేశారు.

జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాల్లో వైకాపా పార్టీ ఖాళీ అవుతోందని లోకేశ్‌ అన్నారు. ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపాతో కలిసి పనిచేయాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. మరోవైపు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆరునూరైనా వైకాపా దారుణ ప‌రాజ‌యాన్ని ఎవరూ ఆప‌లేర‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్‌ కిషోర్‌ కుండబద్దలు కొట్టారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జ‌గ‌న్‌ పని ఎప్పుడో అయిపోయింద‌ని జ‌నం చెప్పేశారన్నారు. అందుకే మునిగిపోయే వైకాపా ప‌డ‌వ నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు దూకేస్తున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు