హైదరాబాద్‌- విజయవాడ హైవే 6లేన్‌.. గడ్కరీతో చర్చించిన ఎంపీ కోమటిరెడ్డి

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం దిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న  హైదరాబాద్‌-విజయవాడ

Updated : 15 Mar 2022 19:35 IST

దిల్లీ: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం దిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న  హైదరాబాద్‌-విజయవాడ హైవే 6వ లేన్‌ నిర్మాణంపై చర్చించారు. ‘‘రహదారి నిర్మాణం 2022 ఏప్రిల్‌లో చేపట్టి 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ, జీఎంఆర్‌ సంస్థ 2025లో చేపడుతామంటోంది. హైవే నిర్మించకుండా ఆర్బిట్రేషన్‌కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోంది. జీఎంఆర్‌ నిర్మించకపోతే కొత్త సంస్థతో హైవే నిర్మాణం చేపట్టాలి’’ అని కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్టు కోమటిరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు