Nara Lokesh: అప్పులు తేవడంలో జగన్‌ పీహెచ్‌డీ: నారా లోకేశ్‌

మీ బిడ్డనంటున్న సీఎం జగన్‌ పట్ల ప్రజలు జర జాగ్రత్తగా ఉండాలని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) సూచించారు.

Updated : 05 Mar 2024 15:33 IST

అమరావతి: మీ బిడ్డనంటున్న సీఎం జగన్‌ పట్ల ప్రజలు జర జాగ్రత్తగా ఉండాలని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) సూచించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే.. రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం.. అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేశ్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. 

‘‘రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు జగన్‌ తాకట్టుపెట్టారు. ఖనిజ సంపద తనఖాతో రూ.7వేల కోట్లు.. మందుబాబులను తాకట్టుపెట్టి రూ.33వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఆయన పాలనలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమే. ఇప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్‌ మాటల వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలి. రానున్న 2 నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలి’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని