Nara Lokesh: 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను.. ఆ హామీ ఏమైంది?: నారా లోకేశ్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు.
శాంతిపురం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్యావసరాల ధరల భారం మోయలేకపోతున్నామని.. పొదుపు సంఘాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ మద్య నిషేధం హామీతో జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల తాళిబొట్లను సీఎం తాకట్టు పెట్టారని ఆరోపించారు. మద్యం తయారీ, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని చోట్లా జగన్ బినామీలే ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను ఇస్తానన్న హామీ ఏమైందని లోకేశ్ ప్రశ్నించారు. ఎన్నో ఆంక్షలతో అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. చట్టం లేకుండానే దిశ పీఎస్‌లు, వాహనాలు అంటూ మోసం చేస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎంతమందికి 21 రోజుల్లో ఉరిశిక్ష వేశారని ఆయన నిలదీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
UP: గ్యాంగ్‌స్టర్ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్..!
-
General News
Andhra news: రావాల్సిన డబ్బులే అడుగుతుంటే.. కాకిలెక్కలు చెబుతున్నారు: బొప్పరాజు
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
-
Crime News
Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ
-
India News
Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్..!