Nara Lokesh: బీసీలంటే బలహీనవర్గాలు కాదు.. బలమైన వర్గాలు: లోకేశ్‌

బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 

Updated : 05 Mar 2024 19:06 IST

మంగళగిరి: బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలంటే బలహీనవర్గాలు కాదని.. బలమైన వర్గాలుగా మార్చింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక బీసీలను మరింత ప్రోత్సహించారని చెప్పారు. ఇప్పుడు వారిలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

‘‘తెదేపా హయాంలో బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ఆదరణ పథకానికి  రూ. వెయ్యి కోట్లు కేటాయించాం. వారికోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ ఉండాలని తెదేపానే తీర్మానం చేసింది. జగన్‌ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.75వేల కోట్లు పక్కదారి పట్టించారు. బీసీలంటే అతనికి చిన్నచూపు.. వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరు. బీసీలకు రాష్ట్రంలో, దేశంలో అనేక పదువులు ఇచ్చిన ఘనత తెదేపాదే. వారి పట్ల తెదేపాకు చిత్తశుద్ధి ఉంది. మంగళగిరిలో నేను ఓడినా.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా’’అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని