Opposition meet: విపక్షాల తదుపరి భేటీ ఎప్పుడంటే.. వివరాలు వెల్లడించిన పవార్‌

Opposition meet: విపక్షాల భేటీతో ప్రధాని మోదీ అశాంతికి గురయ్యారని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ అన్నారు. అలాగే తమ తదుపరి సమావేశం ఎక్కడ జరుగుతుందో కూడా వెల్లడించారు.

Published : 29 Jun 2023 18:05 IST

ముంబయి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP)ను గద్దె దింపడమే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలన్నీ ముందుకు కదులుతున్నాయి. దీనిలో భాగంగా ఆరు రోజుల క్రితం బిహార్‌లోని పట్నాలో విపక్షాలు సమావేశమయ్యాయి. తాజాగా తమ మధ్య మరోసారి సమావేశం జరుగుతుందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(NCP chief Sharad Pawar) వెల్లడించారు. బెంగళూరులో జులై 13-14న ఈ భేటీ జరుగుతుందని తెలిపారు. (Opposition meet)

ఈ సందర్భంగా ఆయన భాజపా నేతలు, పాలనపై విమర్శలు చేశారు. పట్నా సమావేశం( Opposition Patna meet) తర్వాత ప్రధాని మోదీ అశాంతికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ మండిపోతున్నా.. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అనవసర వ్యాఖ్యలు చేయకుండా మహిళల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.

ఇదివరకు జరిగిన సమావేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడతామని విపక్ష పార్టీలు ఐక్యతారాగం వినిపించాయి. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి మరింత స్పష్టత, తదుపరి కార్యాచరణ నిమిత్తం శిమ్లాలో సమావేమవుతామని నేతలు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ వేదికను బెంగళూరుకు మార్చారు. ఇదిలా ఉంటే.. పట్నా భేటీలో తృణమూల్ కాంగ్రెస్‌, ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఉన్న విభేదాలు చర్చకు వచ్చాయి. వాటి మధ్య సఖ్యత కుదరలేదని తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని