Andhra news: తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు

తెదేపా (TDP) నుంచి వైకాపా (YSRCP)లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.

Published : 26 Jan 2024 16:36 IST

అమరావతి: తెదేపా (TDP) నుంచి వైకాపా (YSRCP)లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ ఈనెల 29న మధ్యాహ్నం విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు (Chandrababu) తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పీకర్‌కు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు