YSRCP: సత్తెనపల్లిలో ప్రలోభాల పర్వం.. రెండో రోజు 5వేలకు పైగా చీరలు స్వాధీనం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని గోదాములో వైకాపా నేతలు నిల్వ ఉంచిన వేలాది చీరలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 21 Mar 2024 21:05 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని గోదాములో వైకాపా నేతలు నిల్వ ఉంచిన వేలాది చీరలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలు తీసుకొచ్చి సత్తెనపల్లిలోని గోదాములో నిల్వచేశారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్‌ బొమ్మ ముద్రించి ఉన్న బాక్సుల్లోని 5,472 చీరలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం కూడా సత్తెనపల్లిలో వైకాపా నేత, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్లె విజయభాస్కర్‌రెడ్డికి చెందిన కేవీఆర్‌ మార్ట్‌లో రెండు వేల చీరలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వైకాపా ప్రలోభాలపై సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని