Pawan Kalyan: వైకాపా ఇచ్చిన ఆ హామీ ఏమైంది?: పవన్‌

రాష్ట్రంలో రోజూ అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 19 Apr 2022 14:26 IST

అమరావతి: ఏపీలో రోజూ అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని చెప్పారు. విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని.. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా అవి పనిచేయాలన్నారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల సమయంలో వైకాపా రూ.50వేల పంట పెట్టుబడి హామీ ఇచ్చిందని.. అది ఏమైందని పవన్‌ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలకు పంట పెట్టుబడి అందించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు అప్పులు చేసి ఊబిలో కూరుకుపోతున్నారని.. అన్నంపెట్టే రైతులను కూడా కులాల వారీగా విభజిస్తారా? అని పవన్‌ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని