Payyavula Keshav: ఉరవకొండలో రైతులతో కలిసి ఆందోళన.. పయ్యావుల కేశవ్‌ అరెస్టు

గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ రైతులతో కలిసి ఆందోళనకు దిగిన తెదేపా సీనియర్‌ నేత,  ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను (Payyavula Keshav) పోలీసులు ఆరెస్టు చేశారు.

Updated : 19 Dec 2023 15:05 IST

ఉరవకొండ: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ రైతులతో కలిసి ఆందోళనకు దిగిన తెదేపా సీనియర్‌ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను (Payyavula Keshav) పోలీసులు ఆరెస్టు చేశారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు గుంతకల్లు బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు రైతులతో పయ్యావుల సమావేశమయ్యారు. రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. 

‘‘ జీబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30 వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రైతులు రూ.300 కోట్లు విలువైన పంటలు నష్టపోతున్నారు. హంద్రీనీవా నీరు వృథాగా పోతుంటే రైతులు రగిలిపోతున్నారు. రైతులు నష్టపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా? కాల్వ నిండా నీరు వెళ్తున్నా ఒక్క తడి ఇవ్వలేరా?’’ అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు