Perni Nani: ఏలూరు కలెక్టర్‌పై పేర్ని నాని ఆగ్రహం

ఏలూరు జిల్లా కలెక్టర్‌ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశాలకు కలెక్టర్‌ హాజరుకాకపోవడంపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 19 Jul 2023 17:48 IST

ఏలూరు: ఏలూరు జిల్లా కలెక్టర్‌ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశాలకు కలెక్టర్‌ హాజరుకాకపోవడంపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌కు పేర్ని నాని సూచించారు. ఇలాగే ఉంటే సీఎం ఇంటి ముందు జడ్పీటీసీలతో నిరసన వ్యక్తం చేస్తామని లేఖలో రాయాలని చెప్పారు. అవసరమైతే జడ్పీ సమావేశంలో తీర్మానాన్ని చేయాలని పేర్ని నాని ఛైర్‌పర్సన్‌కు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని