PM Modi: ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

Updated : 18 Apr 2024 17:41 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. 3 పార్టీల నేతలు కలిసి పాల్గొన్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో.. ఉమ్మడిగా నిర్వహించే సభలపై ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు చెబుతున్నారు.

భాజపా అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప లేదా రాజంపేట, మరో నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభల్లో మోదీతో పాటు, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారని సమాచారం. ఈలోగా వీలైనన్ని సభల్లో ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్‌ నిర్ణయించారు. ఈనెల 24న రాయలసీమలోని రాజంపేట, రైల్వే కోడూరు సభల్లో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. 19న ఆలూరు, రాయదుర్గం, 20న గూడూరు, సర్వేపల్లి, సత్యవేడు ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని