Kishanreddy: కిషన్‌రెడ్డి దీక్ష భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

Updated : 13 Sep 2023 19:15 IST

హైదరాబాద్‌: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన 24గంటల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం సాయంత్రం 6గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని పోలీసులు చెబుతుండగా.. గురువారం ఉదయం 6గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతియుత దీక్ష వల్ల పోలీసులకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులను భాజపా కార్యకర్తలు, నిరుద్యోగులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు