central vista: ఆ ఖర్చుతో 66 కోట్ల డోసులు

కరోనా సంక్షోభం వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ఖర్చు చేయడాన్ని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తప్పుబట్టారు. ప్రధాని కొత్త నివాసం నిర్మాణానికి ఖర్చు చేసే బదులు...

Published : 11 May 2021 01:13 IST

దిల్లీ: కరోనా సంక్షోభం వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ఖర్చు చేయడాన్ని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తప్పుబట్టారు. ప్రధాని కొత్త నివాసం నిర్మాణానికి ఖర్చు చేసే బదులు కొవిడ్‌-19కు సంబంధించి వైద్య సాయానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని సూచించారు. ఆ మొత్తంతో ఏమేం చేయొచ్చే వివరిస్తూ సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు.

‘‘ప్రధాని నూతన నివాసం, సెంట్రల్‌ విస్టా మొత్తం ఖర్చు = ₹20వేల కోట్లు = 62 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు = 22 కోట్ల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ = 3 కోట్ల 10 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్లు = 13 ఎయిమ్స్‌ (12వేల పడకలతో కూడిన)’’ అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. ఈ సమయంలో సెంట్రల్‌ విస్టా పనులు అవసరమా అని ప్రశ్నించారు. వెంటనే సెంట్రల్‌ విస్టా పనుల ఆలోచనను విరమించుకోవాలని ప్రియాంక సహా రాహుల్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు  కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ పనులు సజావుగా సాగేందుకు వీలుగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను ‘అత్యవసర సేవల’ కింద కేంద్రం గుర్తించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు