Revanth Reddy: రూ.లక్ష కోట్ల ఆస్తిని.. రూ.7వేల కోట్లకు తెగనమ్మారు: రేవంత్‌రెడ్డి

రూ.లక్ష కోట్ల విలువైన ఔటర్‌ రింగ్‌రోడ్డును రూ.7వేల కోట్లకు తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 26 May 2023 18:11 IST

హైదరాబాద్‌: రూ.లక్ష కోట్ల విలువైన ఔటర్‌ రింగ్‌రోడ్డును రూ.7వేల కోట్లకు తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే ఓఆర్‌ఆర్‌ టోల్‌ స్కామ్‌ వెయ్యిరెట్లు పెద్దదని విమర్శించారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ స్కామ్‌పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. 30 రోజుల నిబంధనపై అర్వింద్‌ కుమార్‌ ఏం చెబుతారని ప్రశ్నించారు. ‘‘ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చారా ఆ సమాచారం ఏది? 30 రోజుల్లో 25శాతం చెల్లించాలని ఒప్పందంలో ఉంది.ఇప్పటికీ ఐఆర్‌బీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. నా ఆరోపణలపై భారాస, భాజపా నేతలు వివరణ ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని