Revanth Reddy: పార్టీని దెబ్బతీసే విధంగా మాట్లాడితే శాశ్వత బహిష్కరణ: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీని దెబ్బ తీసే విధంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఐకమత్యమే మహాబలమన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రేవంత్‌రెడ్డి స్పందించారు....

Published : 18 Apr 2022 01:59 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీని దెబ్బ తీసే విధంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఐకమత్యమే మహాబలమన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రేవంత్‌రెడ్డి స్పందించారు. బహిరంగంగా పార్టీ ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా, విమర్శలు చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు చేసినా ఉపేక్షించేది లేదని రేవంత్‌ వెల్లడించారు. ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతోపాటు క్రిమినల్‌ కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని