BSP: అసైన్డ్‌ భూములు లాక్కొని ప్రభుత్వమే వ్యాపారం చేయడం దుర్మార్గం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రాష్ట్రంలో 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆక్షేపించారు.

Published : 31 Jul 2023 16:07 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆక్షేపించారు. హెచ్ఎండీఏ పరిధిలో అసైన్డ్ భూముల ఆక్రమణలపై హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల ప్రచార లోగోను ఆవిష్కరించారు. ధరణి పోర్టల్ - ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు. 

‘‘బహుజనవాదిననే ముసుగులో సీఎం కేసీఆర్ దళితులను పదేళ్ల నుంచి మోసం చేస్తున్నారు. పేదల అసైన్డ్‌ భూముల్లో శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు కడుతున్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల దగ్గర ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి రైతులకు పంచుతాం. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తాం. నగరంలో ఇళ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తున్న తరహాలోనే అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలి. స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసే జీవో నెం 46ను తక్షణమే సవరించాలి’’ అని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు