Jagga Reddy: సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది: జగ్గారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated : 06 Nov 2023 20:07 IST

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలని భారాస ప్రయత్నిస్తోందన్నారు. లేనివి ఉన్నట్లు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు భారాస మాటలు నమ్మొద్దన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

‘‘రుణ మాఫీ విషయంలో సీఎం కేసీఆర్‌ మాటతప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటాం. మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాదు.. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. జీవోల విషయంలోనూ కేసీఆర్‌ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని పనులు అవుతాయి. భారాస పథకాల గురించి చెబితే ప్రజలు నమ్మరని తెలిసే తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణలో కాంగ్రెస్‌ 70 సీట్లు గెలుస్తుంది. అధికారంలోకి వస్తుంది’’ అని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని