‘ఆ తరహా చట్టాలు తెలంగాణలోనూ రావాలి’ 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తుంటే.. దేశ వ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు భారత్‌బంద్‌లో పాల్గొనడమేంటని భాజపా సీనియర్‌ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో..

Published : 11 Dec 2020 01:31 IST

హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తుంటే.. దేశ వ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు భారత్‌బంద్‌లో పాల్గొనడమేంటని భాజపా సీనియర్‌ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆరు నిర్ణయాలతో రాష్ట్ర వ్యవసాయ రంగం ధ్వంసమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫసల్‌ బీమా యోజన అమలు విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గోవధను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సవరణలు చేస్తూ నూతన చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఆ తరహాలో తెలంగాణలో కూడా చట్టాలు రావాలన్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ‌ చట్టానికి దాసులని.. తెరాసకు కాదని వ్యాఖ్యానించారు. వారిద్దరూ తమ వ్యవహారశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అవసరమైతే వ్యవసాయరంగ సమస్యలపై రైతులతో కలిసి ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని మురళీధర్ రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని