National Front: కొత్త ఫ్రంట్ ఏర్పాటుపై బాదల్ కీలక వ్యాఖ్యలు

భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాతో తమ పార్టీ పొత్తు ముగిసిన అధ్యాయమని తెలిపారు. సాగు చట్టాల రద్దు విషయంలో తమ పార్టీ

Updated : 26 Jul 2021 05:32 IST

దిల్లీ: భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాతో తమ పార్టీ పొత్తు ముగిసిన అధ్యాయమని తెలిపారు. సాగు చట్టాల రద్దు విషయంలో తమ పార్టీ రాజీపడబోదని, సిద్ధాంతపరంగా కూడా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ‘‘శిరోమణి అకాలీదళ్ రైతుల పార్టీ. వారి సమ్యసలే మా పార్టీ సిద్ధాంతం. ఇందుకోసం పార్టీ దేన్నైనా త్యాగం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను పంజాబ్‌లో అమలుకానివ్వం’’ అని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు.     

మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు గురించి మాట్లాడుతూ ‘‘రెండు పార్టీల పొత్తు శాశ్వతమైనది. భాజపాతో అకాళీ దల్‌ పొత్తు ముగిసిన అధ్యాయం. ప్రస్తుతం అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. 2024 లోక్‌సభ ఎన్నికల ముందే అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నా. అది రెండో ఫ్రంట్ అవుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఇక మీదట జాతీయ పార్టీ కాదు. భాజపాను ఎదుర్కొవటమే కొత్త ఫ్రంట్ లక్ష్యం’’ అని సుఖ్‌బీర్ అన్నారు. అలానే రాబోయే ఎన్నికల్లో పంజాబ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాల రద్దు కోసం మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని