గణాంకాలు అబద్ధం చెప్పవు : రాహుల్‌ గాంధీ

కొవిడ్‌ మరణాల విషయంలో గణాంకాలు అబద్ధం చెప్పవని.. ప్రజలను మభ్య పెట్టడానికి మోదీ తప్పుడు లెక్కలు చెబుతారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Updated : 06 May 2022 16:38 IST

దిల్లీ: కొవిడ్‌ మరణాల విషయంలో గణాంకాలు అబద్ధం చెప్పవని.. ప్రజలను మభ్య పెట్టడానికి మోదీనే తప్పుడు లెక్కలు చెబుతారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన కొవిడ్‌ మరణాల నివేదికను ట్వీట్‌  చేస్తూ.. ప్రభుత్వ విధానాలను ఆయన ఎద్దేవా చేశారు. భారత్‌లో మొత్తం 4.7 మిలియన్ల మంది కరోనాతో మృత్యువాత పడితే.. ప్రభుత్వం తప్పుడు గణాంకాలను చూపించిందని విమర్శించారు.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో 4.7 మిలియన్ల మరణాలు సంభవించాయి. ఈ గణాంకాలు లెక్కగట్టేందుకు డబ్ల్యూహెచ్‌ఓ తీసుకున్న ప్రమాణాలను,సమాచార సేకరణ విధానాలను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని