Atchannaidu: సీఎం జగన్‌ మాట తప్పి.. మడమ తిప్పారు: అచ్చెన్నాయుడు

పింఛన్లపై ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ (CM Jagan) తుంగలో తొక్కారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉద్యోగుల పింఛన్ల విషయంలో వైకాపా ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. 

Updated : 01 Jan 2024 19:11 IST

అమరావతి: పింఛన్లపై ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ (CM Jagan) తుంగలో తొక్కారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. ఉద్యోగుల పింఛన్ల విషయంలో వైకాపా ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌ మాట తప్పి.. మడమ తిప్పారని, ఒక్కొక్కరికి రూ. 30 వేలు ఎగనామం పెట్టారని ఆరోపించారు. ‘‘తెదేపా హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. రూ. 200 ఉన్న పింఛన్‌ను చంద్రబాబు రూ. 2వేలకు పెంచారు. సీఎం జగన్‌ ఐదేళ్లలో రూ.750 మాత్రమే పెంచారు’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని