Andhra News: మంత్రుల బస్సుయాత్రలో ప్రజలు రాళ్లు విసురుతారేమో?: జేసీ ప్రభాకర్‌రెడ్డి

వైకాపా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని తెదేపా సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు

Updated : 22 May 2022 13:26 IST

 

అనంతపురం: వైకాపా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని తెదేపా సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏం జరుగుతుందో చూస్తున్నామన్నారు. మంత్రులు బస్సు యాత్రకు పోలీసు రక్షణ పెంచుకోవాలని.. ప్రజలు రాళ్లు విసురుతారేమో అని ఎద్దేవా చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేత కాలవ శ్రీనివాసులును రాయదుర్గంలో ఆలయానికి కూడా వెళ్లనీయరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పోలీసుల నీడలో వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో కాలవ శ్రీనివాసులుతో కలిసి రాయదుర్గం ఆలయానికి వెళతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రిలో జాతీయ స్థాయి మహిళా గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణిలు ఇప్పటికే తాడిపత్రి చేరుకున్నారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని