AP News: ‘వైసీపీ’.. కొత్త అర్థం చెప్పిన భాజపా ఎంపీ జీవీఎల్‌

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ‘వైసీపీ అంటే..

Updated : 23 Dec 2021 16:38 IST

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ‘వైసీపీ అంటే.. ఏమీ చేతగాని ప్రభుత్వం’ అనేలా తయారైందని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దిల్లీలో జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.

‘‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం నిధులివ్వకపోవడంతో కేంద్ర నిధులూ రావడం లేదు. వైకాపా చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది. ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఎక్కువ నిధులు ఇచ్చింది ఏపీకే. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఓటీఎస్‌ పేరుతో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక వైఫల్యానికి కేస్‌ స్టడీలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఉంది’’ అని జీవీఎల్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని