Ts News: కేసీఆర్‌తో అద్భుత సమయం గడిపా: తమిళనాడు సీఎం స్టాలిన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఇవాళ స్టాలిన్‌తో సమావేశమయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన...

Updated : 14 Dec 2021 22:20 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఇవాళ స్టాలిన్‌తో సమావేశమయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం. నదీజలాల వివాదాలు, ఆహార ధాన్యాల కొనుగోళ్లు, కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వ వైఖరి.. తదితర అంశాలపై కేసీఆర్, స్టాలిన్‌ చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దక్షిణాది ప్రముఖులతో భేటీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ గొప్ప ఆతిథ్యానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సమావేశం అయ్యే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని