AP News: పోలీసుల సమక్షంలోనే వైకాపా వర్గీయుల పిడిగుద్దులు..

అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు నేతల ముందే

Updated : 06 Dec 2023 15:38 IST

సుండుపల్లి: అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు నేతల ముందే బాహాబాహీకి దిగడం కడప జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లిలో అధికార పార్టీ నేతల మధ్య ఇవాళ తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీడీవో కార్యాలయం బిల్డింగ్‌ ఆవరణలో ఆసరా కార్యక్రమం ముగించుకొని మండల సర్వసభ్య సమావేశానికి బిల్డింగ్‌లోకి వెళ్లే క్రమంలో మండల వైకాపా ఇన్‌ఛార్జి పదవి విషయమై ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ అమర్‌నాథ్‌రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలు పిడిగుద్దులతో పాటు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా చిక్కుకున్నారు. ఘటనలో ఇద్దరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. నేతలు సర్దిచెబుతున్నప్పటికీ కార్యకర్తలు వినకపోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని