Ts News: కేసీఆర్.. నియంతృత్వ పోకడలు వీడాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు

రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. వాటిపైన చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...

Updated : 24 Sep 2021 18:50 IST

 

హైదరాబాద్: రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. వాటిపైన చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. భాజపా ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఐదుగురు సభ్యులుంటేనే బీఏసీ సమావేశానికి పిలవాలని ఎక్కడ ఉందో సీఎం కేసీఆర్‌ చెప్పాలన్నారు. ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఇకనైనా నియంతృత్వ పోకడలకు కేసీఆర్ మంగళం పాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవు పలికారు. తెరాసలో సీఎల్పీ విలీనమైనట్లు గెజిట్ జారీ చేసిన స్పీకర్.. సీఎల్పీ నేతను ఎందుకు బీఏసీ సమావేశానికి ఆహ్వానించారని ప్రశ్నించారు. భాజపా ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని