Ap News: సూట్‌కేసులు తరలించే అలవాటు తెదేపాకు లేదు: కనకమేడల

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ...

Updated : 14 Nov 2021 16:17 IST

దిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తీవ్రంగా ఖండించారు. లోకేశ్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ మేరకు దిల్లీ నుంచి కనకమేడల సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సూట్‌కేసులు తరలించే అలవాటు తెదేపాకు లేదని స్పష్టం చేశారు. భాష గురించి విజయసాయి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సభ్యత గురించి మాట్లాడే హక్కు వైకాపా నేతలకు లేదని కనకమేడల వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని