
Updated : 03 Oct 2021 19:12 IST
Ts News: జగదీశ్ రెడ్డి.. సూర్యాపేటలో ఎలా గెలుస్తావో చూస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు: రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గాల అభివృద్ధి పట్టడం లేదని.. ఇతర పార్టీల వాళ్లను చేర్చుకోవడమే వారి పనిగా ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు అభివృద్ధిని మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని.. సూర్యాపేటలో ఆయన ఓటమికి కృషి చేస్తానని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులోనూ దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధును అమలు చేస్తానంటే తానూ రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
Tags :