KTR: బండి సంజయ్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ సెటైర్‌!

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు

Updated : 17 Aug 2021 12:44 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమం’పై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరీంనగర్‌లో దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సోమవారం బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ ‘‘ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం ప్రకారం ప్రతి పౌరుడికి రూ.15లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ భాజపా శాఖ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను. అర్హులైన రాష్ట్ర ప్రజలంతా తమ జన్‌ధన్‌ ఖాతాల్లో ధనాధన్‌ డబ్బులు పడేందుకు భాజపా నేతలకు దరఖాస్తులు పంపాలి’’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనం రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామంటూ అప్పట్లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ దరఖాస్తుల ఉద్యమంపై కేటీఆర్‌ ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు