
TS News: కొత్త చెక్‌డ్యాంలతో 3.5 లక్షల ఎకరాలకు నీరు: మండలిలో హరీశ్‌రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే చెక్‌డ్యాంలతో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెక్‌డ్యాంలు, చెరువుల ఆధునికీకరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. చెక్‌డ్యాం నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని హరీశ్‌రావు తెలిపారు. రెండు రోజుల విరామం అనంతరం ఉభయసభలు ఇవాళ తిరిగి సమావేశమయ్యాయి. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం స్వల్పకాలిక చర్చ జరుగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.