Ts News: రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగిస్తాను: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది...

Updated : 06 Jan 2022 15:36 IST

పాల్వంచ‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు.

‘‘పాల్వంచ ఘటన దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురిచేసింది. రామకృష్ణ ఇంట్లో జరిగిన విషాదాంతం తీవ్రంగా కలచివేసింది. రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర క్షోభకు గురిచేసింది. నా కుమారుడు రాఘవ పాత్ర ఉన్నట్లు వీడియోలో రామకృష్ణ ఆరోపించారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా. రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగించేందుకు సిద్ధం. రాఘవను నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంచుతాను. రాఘవ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు దూరంగా ఉంచుతా. ఉద్దేశపూర్వకంగా నాతో పాటు తెరాసపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలు, వ్యక్తుల ఆరోపణలు నేను పట్టించుకోను’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని