AP News: జగన్‌ చేతికి పవరిస్తే.. ప్రజలకు పవర్‌ లేకుండా చేశారు: పట్టాభి

సీఎం జగన్‌ అసమర్థత, చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ రంగం సర్వనాశనమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మండిపడ్డారు. ..

Updated : 10 Oct 2021 17:00 IST

అమరావతి: సీఎం జగన్‌ అసమర్థత, చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ రంగం సర్వనాశనమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మండిపడ్డారు. జగన్‌ మోహన్‌రెడ్డి చేతికి పవర్‌ ఇస్తే.. ప్రజలకు పవర్‌ లేకుండా చేశారని దుయ్యబట్టారు. విద్యుత్‌ వ్యవస్థ సరిగా లేకపోతే రాష్ట్రానికి పరిశ్రమలెలా వస్తాయి? యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎలా లభిస్తాయని నిలదీశారు.  కొన్నాళ్లు పోతే సాయంత్రం ఒక గంట మాత్రమే వీధిలైట్లు వెలుగుతాయని ప్రభుత్వ బోర్డులు పెడుతుందేమోనని ఎద్దేవా చేశారు.  జగన్‌ రివర్స్‌ గేర్‌ పాలనలో త్వరలోనే ప్రజలు లాంతర్లు పట్టుకొని తిరగడం ఖాయమని చెప్పారు. విద్యుత్‌ శాఖలో ఏం జరుగుతుందో మంత్రి బాలినేనికి తెలియదని, జగన్‌ చెప్పింది చేయడం, ఆయన హవాలా సొమ్ముని విదేశాలకు తరలించడమే బాలినేని పని అని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని