Andhra News: పథకాల రూపంలో ప్రజల డబ్బును ప్రజలకే ఇస్తున్నాం: స్పీకర్‌ తమ్మినేని

ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బును వివిధ సంక్షేమ పథకాల ద్వారా తిరిగి ప్రజలకే అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.

Published : 28 May 2022 15:25 IST

పొందూరు: ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బును వివిధ సంక్షేమ పథకాల ద్వారా తిరిగి ప్రజలకే అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పలు అభివృద్ధి పనులకు తమ్మినేని శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.

‘‘ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలి. ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం వెనుకబడిన కులాలకు న్యాయం చేసిందా.. లేదా.. అన్నది కూడా ప్రజలే ఆలోచించాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గ్రహించాలి. సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాలకు పదవులు ఇవ్వడంలో సీఎం జగన్‌ సామాజిక న్యాయం పాటించారు. ప్రతి పథకాన్ని నేరుగా లబ్ధిదారునికి అందించి అవినీతి లేని పాలన అందిస్తున్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలనను మరింత చేరువ చేశారు. పేదరికం పోవాలంటే పిల్లలు చదువుకోవాలి. అందుకే సీఎం జగన్‌ విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా పేద ప్రజలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం’’ అని తమ్మినేని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని