Telangana Formation Day: తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది: రేవంత్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో కోట్లాది మంది ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో కోట్లాది మంది ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘వందల మంది త్యాగాల సాక్షిగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలింది. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ.. కాంగ్రెస్ పార్టీ స్వప్నం. ఇందు కోసం పార్టీ విశ్రమించకుండా శ్రమిస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ