TRS Party: తెలంగాణ భవన్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సందడి..

తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు..

Updated : 27 Apr 2022 12:56 IST

హైదరాబాద్‌: తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెరాస జెండాను ఆవిష్కరించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 40 అడుగుల జెండాను కేటీఆర్‌ ఎగురవేశారు. ఆ తర్వాత తెరాస ఆవిర్భావ దినోత్సవ కేక్‌ కట్‌ చేశారు. పాటలు, బాణసంచా చప్పుళ్లతో తెలంగాణ భవన్‌ ప్రాంగణం కోలాహలంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని