Rahul Gandhi: ఇవేనా మంచి రోజులు..?

ఇటీవల కేంద్రంపై వరుస ఆరోపణలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా మరోసారి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

Published : 06 Jul 2021 21:51 IST

దిల్లీ: ఇటీవల కేంద్రంపై వరుస ఆరోపణలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా మరోసారి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదంటూ ట్విటర్‌ వేదికగా మంగళవారం మండిపడ్డారు. ‘ఇవేనా మీరు చెప్పిన మంచి రోజులు?’ అంటూ భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పేదలను ఆర్థికంగా ఆదుకోకపోగా.. సకాలంలో వేతనాలు చెల్లించకుండా వారి హక్కులను సైతం కాలరాస్తోందంటూ ఆరోపించారు. చాలా మందికి కుటుంబ పోషణ సైతం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రఫేల్‌, పెరిగిన పెట్రో ధరలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం లాంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
        

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని