వైఎస్‌ఆర్‌ జనం కోసం జీవించారు‌: విజయమ్మ

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల

Updated : 08 Jul 2021 18:00 IST

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘శత్రువులైనా, ప్రత్యర్థులైనా వైఎస్‌ఆర్‌ను అభిమానించారు. నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలి. ఆయన మరణంలేని నాయకుడు. తెలంగాణలో వైఎస్‌ కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. వైఎస్‌ కల అసంపూర్తిగా మిగిలిపోయింది. తెలుగువారి గుండె చప్పుడు వైఎస్‌. షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నమస్సులు. జగన్‌, షర్మిల వైఎస్‌ ఆత్మీయత, హావభావాలు పుణికిపుచ్చుకున్నారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలు, పార్టీలకు ప్రతినిధులు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయి. తండ్రి కల సాకారం చేసేందుకు షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి ఆశయ సాధన కోసం మీ ముందుకు వస్తోంది. మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకోండి’’ అని విజయమ్మ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని