YS Sharmila: తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు? అది సాధ్యమా?: షర్మిల

బంగారు తెలంగాణ కాదు.. ఇది బానిసత్వపు తెలంగాణ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. 

Updated : 22 Feb 2022 14:10 IST

హైదరాబాద్‌: బంగారు తెలంగాణ కాదు.. ఇది బానిసత్వపు తెలంగాణ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 59ఏళ్లు దాటిన రైతుకు బీమా ఎందుకు వర్తించట్లేదని ప్రశ్నించారు. రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించామని.. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు.

‘‘ తెలంగాణలో 66లక్షల మంది రైతులుంటే 41లక్షల మందికే బీమా వర్తింపా? 59ఏళ్ల లోపే రైతులు చనిపోవాలని ప్రభుత్వం భావిస్తోందా? కౌలు రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎల్‌ఐసీలో 70ఏళ్లు పైబడిన వారికీ పాలసీలు ఉన్నాయి. పాలసీని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలని కోరాం. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు? అది సాధ్యమా? ప్రజలను రెచ్చగొట్టేందుకు మంత్రి కేటీఆర్‌ విలీనం గురించి మాట్లాడుతున్నారు’’ అని షర్మిల అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని