ఇంటికెళ్లి వంట చేసుకో!

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియాసూలేను ఉద్దేశించి మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ‘నీకు రాజకీయాలు ఎందుకు..ఇంటికి వెళ్లి వంటచేసుకో’ అని బుధవారం ఆయన చేసిన

Published : 27 May 2022 05:56 IST

సుప్రియా సూలేపై భాజపా నేత వ్యాఖ్యలు

ముంబయి: నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియాసూలేను ఉద్దేశించి మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ‘నీకు రాజకీయాలు ఎందుకు..ఇంటికి వెళ్లి వంటచేసుకో’ అని బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. దీంతో చంద్ర కాంత్‌ పాటిల్‌ గురువారం ఒక ప్రకటన చేస్తూ... తాను చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావని వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర పల్లెల్లో మాదిరి తాను మాట్లాడానని చెప్పారు. మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల అమలుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతించింది. ఇదెలా సాధ్యమయ్యిందో తెలుసుకునేందుకు దిల్లీలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలిసినప్పటికీ ఆయన వెల్లడించలేదని సుప్రియ తెలిపారు. మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల కూటమి ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా సాధించలేకపోయిందని ఆరోపిస్తూ భాజపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆ సందర్భంగా చంద్రకాంత్‌ పాటిల్‌...సుప్రియపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పలు మహిళా సంఘాలు, పార్టీలు అభ్యంతరం తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని