Dhoni:ఈ బుడ్డోడు ధోనీని మించేలా ఉన్నాడు!
మహేంద్రసింగ్ ధోనీకి యార్కర్ విసిరితే ఏ షాట్ ఆడుతాడని ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానం.. హెలికాప్టర్ షాట్. అవును! ఈ షాట్‌ను పరిచయం చేసిందే ధోనీ. తొలుత దీన్ని
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్రసింగ్ ధోనీకి యార్కర్ విసిరితే ఏ షాట్ ఆడుతాడని ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానం.. హెలికాప్టర్ షాట్. అవును! ఈ షాట్‌ను పరిచయం చేసిందే ధోనీ. తొలుత దీన్ని చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మెరుపు వేగంతో దూసుకువచ్చే యార్కర్‌ని అంతేవేగంతో తిరిగి బాదడమే ఈ షాట్ ప్రత్యేకత. దీన్ని అనుసరించడానికి ఎంతోమంది క్రికెటర్లు ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ లాంటి ఆటగాళ్లు కొంతమేర సఫలీకృతులయ్యారు.
అయితే, ఓ బుడ్డోడు అచ్చం ధోనీలాగా హెలికాప్టర్ షాట్లను అలవోకగా బాదుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తలకు హెల్మెట్ పెట్టుకుని, కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని ప్రొఫెషనల్ క్రికెటర్ వేషధారణలో మైదానంలో క్రికెట్ ఆడుతున్న బుడ్డోడి వీడియోని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ట్విటర్లో శుక్రవారం ఉదయం పోస్టు చేశాడు. ఇందులో ఈ బుడ్డోడు.. వచ్చిన బంతిని వచ్చినట్టే బలంగా బాదుతూ కనిపించాడు. హెలికాప్టర్ షాట్లతోపాటు లెగ్ సైడ్ దిశగా ఆడే స్లాగ్ స్వీప్‌ని కూడా సునాయాసంగా ఆడాడు. ఒక మోకాలిని నేలకు తాకించి బౌలర్ తలమీదుగా ఆడిన షాట్‌ని చూస్తే ఈ బుడ్డోడు ఎంత రాటుదేలిన క్రికెటరో అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా చూసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?