బెన్‌స్టోక్స్ అదరగొట్టెన్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అదరగొట్టాడు. కెరీర్లో తొలిసారి అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్ సాధించాడు. ఐసీసీ మంగళవారం విడుదల ఈ ర్యాంకింగ్స్‌లో స్టోక్స్...
టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆల్‌రౌండర్
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అదరగొట్టాడు. కెరీర్లో తొలిసారి అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్ సాధించాడు. ఐసీసీ మంగళవారం విడుదల ఈ ర్యాంకింగ్స్‌లో స్టోక్స్ మొదట ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు. విండీస్ సారథి జేసన్ హోల్డర్నను వెనక్కి నెట్టాడు. అలాగే బ్యాట్స్‌మన్ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్‌తో సమానంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో స్టోక్స్ కన్నా ముందు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్ అగ్రస్థానంలో ఉండగా, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్లను అధిగమించాడు.
మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో హోల్డర్ 18 నెలల పాటు నంబర్ వన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టోక్స్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. తొలి టెస్టులో 43, 46 పరుగులు చేసిన అతడు రెండో టెస్టులో 176, 78 విరోచితంగా ఆడాడు. దీంతో ఆల్‌రౌండర్ల జాబితాలో తొలిసారి అగ్రస్థానం చేరుకున్నాడు. కాగా, 2006 మేలో మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాప్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్‌గా స్టోక్స్ రికార్డు నెలకొల్పాడు. అలాగే 2008 ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలీస్ అత్యథికంగా 517 పాయింట్లు సాధించాక.. స్టోక్స్ మాత్రమే 497 పాయింట్లు సాధించాడు. ఇక ఇదే జాబితాలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 397 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!