టీ20ల్లో టాపర్‌గా ఇంగ్లాండ్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా

Updated : 02 Dec 2020 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లకు 191 పరుగులు చేసింది. డసెన్‌ (74*, 32 బంతుల్లో, 5×4, 5×6), డుప్లెసిస్‌ (52; 37 బంతుల్లో, 5×4, 3×6) అర్ధశతకాలతో మెరిశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ వికెట్ కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ మలన్‌ (99*; 47 బంతుల్లో, 11×4, 5×6) విధ్వంసం సృష్టించగా, జోస్‌ బట్లర్ (67*; 46 బంతుల్లో, 3×4, 5×6) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించారు.

కాగా, ఈ సిరీస్‌ విజయంతో ఇంగ్లాండ్‌ (275) తమ రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (275), భారత్ (266), పాకిస్థాన్‌ (262), దక్షిణాఫ్రికా (252) ఉన్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 4 నుంచి ఇంగ్లాండ్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని