
IPL 2021: వచ్చే ఏడాది ఆడతానో లేదో: ధోనీ
దుబాయ్: వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ధోని అనుబంధం కొనసాగనుంది. అయితే చెన్నైతోనే ఉన్నా.. 2022లో తాను ఆడతానా లేదా అన్నది చెప్పలేనని ధోని చెప్పాడు. అది రిటెన్షన్ విధానంపై ఆధారపడి ఉంటుందని అన్నాడు. ‘‘మీరు నన్ను పసుపు రంగు దుస్తుల్లో చూడొచ్చు. కానీ నేను సీఎస్కే తరఫున ఆడతానా లేదా అన్నది చెప్పలేను. ఈ విషయంలో చాలా అనిశ్చితి ఉంది. రెండు కొత్త జట్లు రానుండడమే అందుకు కారణం. ఆటగాళ్లను అటిపెట్టుకునే విధానం ఎలా ఉంటుందో తెలియదు. ఎంతమంది విదేశీయులను, ఎంత మంది భారత ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చో తెలియదు’’ అని ధోని చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.