రఫేల్‌.. రప్ఫాడిస్తాయ్‌: సచిన్‌

భారత భూభాగంపై అడుగు పెట్టిన శత్రు భయంకర రఫేల్‌ యుద్ధ విమానాలకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ స్వాగతం చెప్పారు. వీటి చేరికతో మన పోరాట సామర్థ్యం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. భారత వాయుసేనకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.......

Published : 31 Jul 2020 02:32 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: భారత భూభాగంపై అడుగు పెట్టిన శత్రు భయంకర రఫేల్‌ యుద్ధ విమానాలకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ స్వాగతం చెప్పారు. వీటి చేరికతో మన పోరాట సామర్థ్యం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. భారత వాయుసేనకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘రఫేల్‌ యుద్ధ విమానాలు మన సైన్యంలో భాగమైనందుకు భారత వైమానిక దళానికి హృదయపూర్వక అభినందనలు. విశ్రాంతి లేకుండా గగనతలం నుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన సైనిక బలగాలు ఇప్పుడు మరింత ఉన్నతీకరణ చెందాయి. జై హింద్‌’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు. తెందూల్కర్‌కు వాయుసేనతో అనుబంధం ఉండటం గమనార్హం. అంతకు ముందు టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్ రైనా సైతం వాయుసేనకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే సామర్థ్యం రఫేల్‌ యుద్ధ విమానాల సొంతం. అణ్వస్త్రాలతో దాడిచేయగల సామర్థ్యం ఉన్న ఇవి చైనా, పాకిస్థాన్‌ సరిహద్దు వివాదాల నేపథ్యంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ కంపెనీ నుంచి 36 రఫేల్‌ విమానాలను కొనుగోలుకు ఎన్డీయే ప్రభుత్వం 2016లో రూ.59వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ఐదు విమానాలు ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరి యూఏఈకి చేరుకొని అక్కడి నుంచి అంబాలకు బుధవారం చేరుకున్నాయి. వీటికి ఎస్కార్టులుగా రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు రావడం గమనార్హం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని