లంచ్‌ విరామానికి ఆసీస్‌ 149/4

బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఆడుతోంది. నాలుగో రోజు ఆటలో లంచ్‌ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు

Updated : 18 Jan 2021 07:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఆడుతోంది. నాలుగో రోజు ఆటలో లంచ్‌ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. స్మిత్ (28), గ్రీన్‌ (4) నిలకడగా ఆడుతున్నారు. భారత్‌ కంటే ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు 21/0 స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్‌ ఓపెనర్లు వార్నర్‌ (48), హ్యారిస్‌ (38) జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చారు. కొద్దిసేపటికే సిరాజ్‌ ఒకే ఓవర్‌లో లబుషేన్‌ (28), వేడ్ (0)ను ఔట్‌ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు.

ఇదీ చదవండి

వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔట్‌..ఆధిక్యం 133

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని